namastheindia.in
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 12:30 am Digital Edition : NAMASTE INDIA

గుంటూరులో గుక్కెడు నీటికీ కష్టమే.. తాగునీటిలో డ్రైనేజీ కలకలం!

గుంటూరులో కలుషిత తాగునీటి సరఫరా.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు!

డ్రైనేజీ నీరు కలుస్తోందని స్థానికుల ఆందోళన.. డయేరియా ప్రబలితే బాధ్యత ఎవరిది? నగరంలోని మల్లికార్జునపేట పరిధి వెంకటరావు నగర్‌లో (శ్రీనగర్ 3/7 ప్రాంతం) గత కొన్ని రోజులుగా ఇళ్లకు మురికినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులైన్లలోకి డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో నీరు కలుషితమవుతోందని ఆరోపిస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి కారణంగా డయేరియా వంటి వ్యాధులు ప్రబలితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తాగునీటి పైపులైన్లను తనిఖీ చేయాలని, డ్రైనేజీ నీరు కలుస్తున్న సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.