గుంటూరులో గుక్కెడు నీటికీ కష్టమే.. తాగునీటిలో డ్రైనేజీ కలకలం!

గుంటూరులో కలుషిత తాగునీటి సరఫరా.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు! డ్రైనేజీ నీరు కలుస్తోందని స్థానికుల ఆందోళన.. డయేరియా ప్రబలితే బాధ్యత ఎవరిది? నగరంలోని మల్లికార్జునపేట పరిధి వెంకటరావు నగర్‌లో (శ్రీనగర్ 3/7 ప్రాంతం) గత కొన్ని రోజులుగా ఇళ్లకు మురికినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులైన్లలోకి డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో నీరు కలుషితమవుతోందని ఆరోపిస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. కలుషిత నీటిని వినియోగించడం...